News August 26, 2025
శ్రీరాంపూర్: ‘మట్టి వినాయకులను పూజించాలి’

వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు మట్టి ప్రతిమలకు పూజలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని సంస్థ డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సోమవారం ఉద్యోగులు, అధికారులకు వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయక ప్రతిమలను చెరువులు, జలాశయాలలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం కలుగుతుందన్నారు.
Similar News
News August 26, 2025
బీసీ సంక్షేమాధికారిగా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి పదోన్నతి పొంది బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు.
News August 26, 2025
రేబీస్ సోకిందని పాపను చంపి తల్లి సూసైడ్

TG: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. యశోద(36) అనే మహిళ రేబీస్ సోకిందని తన మూడేళ్ల కూతురును చంపి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యశోద భర్త సంచలన విషయాలు వెల్లడించారు. కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడంతో పాపకు రేబీస్ సోకిందని యశోద అనుమానించిందని అన్నారు. టీకాలు వేయించినా అనుమానం పోలేదని, మతిస్తిమితం కోల్పోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే పాపను చంపి తను ఉరివేసుకుందని తెలిపారు.
News August 26, 2025
నెల్లూరు: టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో?

నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టుతారు, అసలు అధిష్ఠానం మనసులో ఎవరున్నారో? అని ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవికి రెండు సామాజిక వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం అనుభవం, విధేయత తదితర అంశాలకు లోబడి చేస్తుందా లేదా అని పార్టీ నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ పదవి కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ అంశానికి తెరపడనుంది.