News October 30, 2025
శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కంపెనీ వ్యాప్తంగా నాలుగు ఏరియాలలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్తగా వెయ్యి క్వార్టర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలో 449, రామగుండలంలో 318, మనుగూరులో 154, భూపాలపల్లిలో 79 క్వార్టర్లు నిర్మించనున్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News October 30, 2025
యూట్యూబ్ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్‌లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
News October 30, 2025
మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.
News October 30, 2025
హుజూర్‌నగర్‌కు మూడు పేర్లు

హుజూర్‌నగర్‌కు పాతకాలంలో పురుషోత్తమపురి, పోంచర్ల అనే రెండు పేర్లు ఉండేవి. ఫణిగిరి గుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి వెలయడంతో ఈ ప్రాంతం పురుషోత్తమపురిగా పేరొందింది. ఆ తర్వాత ముత్యాలమ్మ (పోచమ్మ) దేవాలయం ఏర్పడటంతో పోంచర్లగా మారింది. నవాబుల పాలనలో దీనిని హుజూర్‌నగర్‌గా మార్చారు. ఈ రెండు ఆలయాలు నేటికీ ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉన్నాయి.


