News July 9, 2025
శ్రీరాంపూర్: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారికి రూ.లక్ష

సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు CMD బలరాంనాయక్ బుధవారం తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్ పాసై మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News July 10, 2025
వైభవంగా చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.
News July 10, 2025
MBNR: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.
News July 10, 2025
కోరుట్ల: ‘మన ఊరు-మనబడి నిధులను మంజూరు చేయించాలి’

పెండింగ్‌లో ఉన్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి సంబంధించిన నిధులు మంజూరు చేయించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వరద డ్యామేజ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, దేవాదాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.