News April 3, 2025
శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం

నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో ఏప్రిల్ 6 న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను ఆలయ ధర్మకర్త కొల్లు క్షత్రయ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆహ్వానంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
Similar News
News November 6, 2025
సోన్: నీటి కుంటలో జారి పడి మహిళ మృతి

సోన్ మండలం, వెల్మల్ గ్రామానికి చెందిన మూడ సాయవ్వ (47) గురువారం బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటికుంటలో జారిపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
News November 6, 2025
జనగామ జిల్లాలో రేపు ‘వందే మాతరం’ సామూహిక గీతాలాపన

మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన “వందే మాతరం” గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సామూహిక గీతాలాపన చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News November 6, 2025
ఫర్నిచర్ శిక్షణ కోసం 19 మంది ఎంపిక

భద్రాద్రి కలెక్టరేట్లో NSTI, FFSC, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్ ఫర్నిచర్ ప్రొడక్షన్ & ఇన్స్టాలేషన్ శిక్షణ కోసం డ్రాయింగ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఎంపికల కోసం ఆన్లైన్లో 69 మంది పేరు నమోదు చేసుకోగా మొత్తం 29 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల ఆధారంగా 19 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.


