News April 6, 2025

శ్రీరాముని ఆదర్శాలతో వివక్షలు లేని సమాజం: వెంకయ్య 

image

సమాజంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్న వివక్ష, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముని ఆదర్శాలే సరైన పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాచలం(మ) శ్రీరామపురం రామాలయంలో జరిగిన శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంలో అయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ శ్రీరాముడు ఆదర్శం కావాలని, ప్రతి గ్రామంలోనూ రామాయణ పారాయణం జరగాలన్నారు.

Similar News

News April 8, 2025

NLR: పోలీసులపై పర్వత రెడ్డి విమర్శలు

image

నెల్లూరు జిల్లా పోలీసులు అనాలోచితంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏదో రకంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు. నాయకులకే రక్షణ లేకపోతే ప్రజల సంగతి ఏంటని ప్రశ్నించారు.

News April 8, 2025

నెల్లూరు: దొంగలు వస్తారు.. జాగ్రత్త!

image

నెల్లూరు జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పడుగుపాడు పంచాయతీలో మధుసూదనరావు, దయాకర్ ఇళ్లకు తాళాలు వేసి HYD వెళ్లగా ఆదివారం రాత్రి నగదు, బంగారం దోచుకెళ్లారు. కోవూరు శాంతినగర్‌కు చెందిన సురేశ్ రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగానే రూ.20వేలు చోరీ చేశారు. సెలవులకు వెళ్లే వాళ్లు, రాత్రిపూట ఇంటి బయట నిద్రించే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. LHMS సేవలు వాడుకోవాలని కోరుతున్నారు.

News April 8, 2025

నెల్లూరు: నమ్మించి మోసం చేశాడు..!

image

కావలి ముసునూరుకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని గుడ్లూరు పరిధికి చెందిన మహిళ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తన వద్ద రూ.3 లక్షల నగదు తీసుకున్నాడని, శారీకరంగా కలిశాక పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. పోలీసులు విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

error: Content is protected !!