News April 5, 2025
శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 6, 2025
సీతారాముల కళ్యాణం.. పోటెత్తిన భక్తజనం

TG: భద్రాద్రి భక్తజనసంద్రమైంది. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తుండగా అడుగడుగునా నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం 12గం.లకు రామయ్య, సీతమ్మల కళ్యాణం జరగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో CM రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News April 6, 2025
ట్రెండింగ్‌లో #GetOutModi

కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరు తమిళ నెటిజన్లు Xలో ‘గెట్ ఔట్ మోదీ’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. డీలిమిటేషన్‌తో తమ ప్రాధాన్యం తగ్గిస్తున్నారని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో హిందీని రుద్దాలని చూస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. నార్త్, సౌత్ స్టేట్స్ మధ్య నిధుల కేటాయింపులో తేడాలపై ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి PM వెళ్తున్న నేపథ్యంలో #GetOutModi ట్రెండవుతోంది.
News April 6, 2025
శ్రీరామ నవమి రోజునే రాముని కళ్యాణం ఎందుకంటే?

శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో జన్మించారు. ఆయన వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే, ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. కాగా సీతాసమేతంగా శ్రీరాముడి పట్టాభిషేకం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.