News February 19, 2025
శ్రీలత రెడ్డికి సూర్యాపేట బీజేపీ పగ్గాలు!

BJP జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా ఆమె పేరును మంగళవారం ప్రకటించింది. నేరేడుచర్లకు చెందిన శ్రీలతరెడ్డి 2023లో BRS నుంచి BJPలో చేరి హుజుర్నగర్ నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే NLG జిల్లా BJP అధ్యక్షుడిగా వర్షిత్‌రెడ్డి, యాదాద్రిభువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్‌ని పార్టీ నియమించిన విషయం తెలిసిందే.
Similar News
News November 3, 2025
పోలీస్ గ్రీవెన్స్‌లో 45 ఫిర్యాదులు

పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 45 మంది అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని, తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News November 3, 2025
చిట్యాల అండర్‌పాస్ వద్ద సమస్య పరిష్కారానికి ఎస్పీ పర్యవేక్షణ

జాతీయ రహదారి 65 పై చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
News November 3, 2025
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.


