News March 2, 2025

శ్రీలేఖ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: కలెక్టర్

image

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దురదృష్టవశాత్తూ విద్యార్థి శ్రీలేఖ ఆదివారం ఉదయం మృతి చెందిందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.5 లక్షలు ప్రకటించిందన్నారు.

Similar News

News March 3, 2025

కర్నూలు జిల్లాలో 336 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్‌ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్‌2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లాలో 336 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు RIO గురవయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20,506 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 20,160 మంది హాజరయ్యారని అన్నారు. పత్తికొండ జీజేసీలో ఆరుగురు, మిగతా కళాశాలల్లో నలుగురిపై నలుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.

News March 3, 2025

22,227 మంది విద్యార్థులు.. ఉ.9 నుంచి పరీక్ష

image

ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్‌ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. కర్నూలు జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,227 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students

News March 3, 2025

శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు డీఈవో

image

సీ.బెలగల్ మండలం పోలకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి శ్రీలేఖ కర్నూలులో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరులో జరిగిన విద్యార్థిని అంత్యక్రియలలో ఈడీవో శ్యామ్యూల్ పాల్ పాల్గొని, పాడెమోశారు. అంత్యక్రియలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. కాగా, సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో విద్యార్థినిపై చెట్టు విరిగిపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

error: Content is protected !!