News February 11, 2025

శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన కలెక్టర్

image

యాదగిరిగుట్టలో పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈవో భాస్కరరావు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

image

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్‌ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్‌ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.

News November 14, 2025

4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్‌లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.

News November 14, 2025

వంటింటి చిట్కాలు

image

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.