News February 3, 2025

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ

image

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి సందర్భంగా వైభవంగా నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విశేషపూజను ఏడాదికోసారి నిర్వహించారు.

Similar News

News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

News February 3, 2025

ములుగు: ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

News February 3, 2025

సిద్దిపేట: స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన కమిషనరేట్ సిబ్బంది

image

రాష్ట్రస్థాయి కరాటేలో గోల్డ్ మెడల్, పవర్ లిఫ్టింగ్‌లో సిల్వర్, బాడీ బిల్డింగ్‌లో సిల్వర్, టెన్నిస్‌లో కాంస్య పతకాలు సాధించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అనురాధ అభినందించారు. కరీంనగర్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో రాజన్న సిరిసిల్ల జోన్ తరుపున సిద్దిపేట కమిషనరేట్ సిబ్బంది, అధికారులు సత్తా చాటారు.