News February 26, 2025

శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : BR నాయుడు

image

శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇటీవల ఛైర్మన్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి వాట్సాప్ ద్వారా చేసిన దానిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News February 26, 2026

కామారెడ్డి: ‘స్పందించకుంటే 195 వాహనాలకు వేలం’

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నాయని, యజమానులు తమ ధ్రువపత్రాలను సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. 6 నెలల గడువులోగా తగిన ఆధారాలతో సంప్రదించని పక్షంలో, చట్టబద్ధంగా వేలం ద్వారా విక్రయిస్తామని స్పష్టం చేశారు.

News February 26, 2026

పార్వతీపురం: ‘బాల కార్మికులు పనికి కాదు.. బడికి వెళ్లాలి’

image

జిల్లాలోని బాల కార్మికులు పనికి కాదని.. బడికి వెళ్లాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో కార్మికుల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల కార్మికుల నిర్ములన ఒక ఉద్యమంలా చేపట్టాలని బాల కార్మిక నిర్ములన శాఖ అధికారి ఎసిఎల్ సువర్ణను ఆదేశించారు. బాలల హక్కులను కాపాడటం ప్రతీ పౌరుడి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.

News February 26, 2026

పార్వతీపురం: డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం

image

జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్‌ శాఖలతో జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్‌లలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయాలని సూచించారు.