News April 20, 2024
శ్రీవారి మెట్ల మార్గంలో హీరోయిన్ సంయుక్త మీనన్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శనివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా సినీ నటి సంయుక్త మీనన్ తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు అధికారులు బస, దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆమె ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకోనున్నారు.
Similar News
News April 14, 2026
చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.
News April 14, 2026
చిత్తూరు: పుంజుకుంటున్న టమాటా ధరలు

సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోంది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.
News April 14, 2026
చిత్తూరు జిల్లా ‘మండుతోంది’

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఏడు మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా తవణంపల్లెలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, రొంపిచెర్లలో 40.7, శ్రీరంగరాజపురంలో 40.6, నిండ్రలో 40.5, గంగవరంలో 40.3, విజయపురంలో 40.0, పెద్దపంజాణిలో 39.6, బంగారుపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.


