News December 8, 2025
శ్రీవారి సంపదకు రక్షకులు ఎవరో తెలుసా?

శ్రీవారి ఆలయంలోని నిధులు, సంపదలను రక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వారే శంఖనిధి, పద్మనిధి. వీరి విగ్రహాలు ఆలయ మహద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. మనం క్యూలో లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకుల్లా కనిపించేది వీరే. ఈ విగ్రహాలు దాదాపు రెండడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని పంచ లోహాలతో తయారు చేశారు. ఈ దేవతలు శ్రీవారి ధనాన్ని కాపాడే ముఖ్యమైన రక్షకులుగా భక్తులు భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
Similar News
News December 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 90 సమాధానం

ప్రశ్న: రామాంజనేయుల నడుమ యుద్ధమెందుకు జరిగింది?
సమాధానం: రాముని గురువు విశ్వామిత్రుడిని కాశీ రాజు యయాతీ అవమానించాడు. దీంతో యయాతిని చంపమని రాముడిని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. అటువైపు తన ప్రాణాలు కాపాడమని యయాతి ఆంజనేయుడిని శరణు వేడాడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆంజనేయుడు పలికిన రామనామం రాముని బాణాలు నిలవలేకపోయాయి. దీంతో విశ్వామిత్రుడు యుద్ధాన్ని ఆపి, యయాతిని క్షమించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 8, 2025
ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
News December 8, 2025
10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


