News September 23, 2025
శ్రీశైలంలో అలరిస్తున్న కళారూపాలు

శ్రీశైల మహా క్షేత్రంలో కన్నుల పండువగా దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్లు బృంగి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలు భక్తులను ఎంతగానో అలరించాయి. దేవతామూర్తుల రూపాలు, విచిత్ర వేషధారణ, వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Similar News
News September 23, 2025
భద్రాది: ‘ఆమె డ్వాక్రా పైసలు కట్టలే..!’

బూర్గంపాడు మండలం సారపాకలో డ్వాక్రా బుక్ కీపర్ వసంత తమ డబ్బులు స్వాహా చేసిందని మహిళలు ఆరోపిస్తున్నారు. సోమవారం ఆమె ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతినెలా ఒక్కో గ్రూపు నుంచి రూ.5,96,500 చొప్పున వసూలు చేసి బ్యాంకులో జమ చేయలేదని ఆరోపించారు. రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా నెలవారీ డబ్బు కట్టడం లేదని అధికారులు చెప్పడంతో వారు విస్తుపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.
News September 23, 2025
నస్పూర్: జాతీయ రహదారుల ఆర్బిట్రేషన్ కేసులపై సమీక్ష

మంచిర్యాల జిల్లాలో జాతీయ రహదారి 163జీ పరిధిలోని 3వ విడత ఆర్బిట్రేషన్ కోసం దాఖలు చేసిన 114 కేసులను పరిశీలిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారి 63కు సంబంధించి జిల్లాలోని 17 గ్రామాల్లో కోర్టు స్టే ఉన్న గ్రామాలను మినహాయించి మిగతా గ్రామాల్లో అవార్డు జారీ చేసినట్లు వివరించారు.
News September 23, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 70,787 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 15.778 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతోంది.