News March 25, 2025

శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల వాహనాలే!

image

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది కర్ణాటక భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు వాహనాలతో పాటు పాదయాత్ర ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కర్ణాటక భక్తులకు చెందిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలుపుకుంటున్నారు.

Similar News

News July 6, 2025

అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

image

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టూ అడవి, గుట్ట మీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.

News July 6, 2025

తెల్లం వర్సెస్‌ పొదెం..!

image

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, పొదెం వీరయ్య మధ్య <<16950859>>వర్గపోరు <<>>రోజురోజుకూ ముదురుతోంది. దుమ్ముగూడెం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పొదెం చేసిన వ్యాఖ్యలతో వేడెక్కింది. సోషల్‌ మీడియాలో కౌంటర్‌‌లు చేసుకుంటున్నారు. ఇరువర్గాల పరస్పర ఆరోపణలు ఎటు దారి తీస్తాయో.. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్‌లో పరిస్థితి ఏంటని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నట్లు టాక్.

News July 6, 2025

పాలమూరు: ఈ ఏడాది.. కొత్త స్కూళ్లు మంజూరు.!

image

ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. అన్ని వసతులు కల్పిస్తూ ప్రారంభించేందుకు DEOలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే MBNR-9,917, NGKL-9,010, GDWL-7,205, NRPT-8,454, WNPT-8,103 మంది విద్యార్థులు కొత్త అడ్మిషన్లు అయ్యారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.