News February 24, 2025
శ్రీశైలంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా పాతాళ గంగ ఘాట్‌కు చేరుకొని అక్కడ ఏర్పాట్లను భక్తులను అడిగి తెలుసుకున్నారు. పాతాళ గంగ వద్ద పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News February 25, 2025
ఖమ్మం: సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లిలో సోమవారం రైతులతో సమావేశమై సాగు నీటి విడుదల షెడ్యూల్‌పై ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో తాగునీటి సరఫరా, విద్య, వైద్యం అంశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News February 25, 2025
కొత్తగూడెం: సత్వర చర్యలు తీసుకోండి: అదనపు కలెక్టర్లు

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
News February 25, 2025
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్: ఇలా త్రిపాఠి

ఈనెల 27న జరగనున్న వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27సాయంత్రం 4 గంటల వరకు సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధమని చెప్పారు.