News October 22, 2025

శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాల నిలుపుదల

image

కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలిపేశారు. శని, ఆది, సోమవారాల్లో అమ్మవారి కుంకుమార్చనను ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు. రుద్ర హోమం, చండీ హోమం, నిత్యకల్యాణం వంటి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Similar News

News October 22, 2025

రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అటు భారీ వర్షసూచన నేపథ్యంలో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

News October 22, 2025

ఆసియా కప్‌ను నేనే ఇస్తా: మోహ్సిన్ నఖ్వీ

image

ఆసియా కప్‌ను భారత్‌కు తానే అప్పగిస్తానని ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని నఖ్వీకి BCCI లేఖ రాసింది. ‘ఒక వేడుక ఏర్పాటు చేస్తాం. BCCI ఆఫీస్ హోల్డర్, విన్నింగ్ టీమ్‌లో అందుబాటులో ఉన్న ఏ ప్లేయర్‌తోనైనా వచ్చి ట్రోఫీ కలెక్ట్ చేసుకోండి’ అని నఖ్వీ చెప్పినట్లు GEO న్యూస్ పేర్కొంది. ఈ విషయాన్ని ICC వద్దే తేల్చుకోవాలని BCCI ఫిక్సైనట్లు తెలుస్తోంది.

News October 22, 2025

రైళ్ళ రాకపోకలు ఆలస్యం: SCR

image

పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడవనున్నట్లు SCR పేర్కొంది.
T.No.12722 HYD దక్షిణ్ 10.30Hrs
T.No.12648 కొంగు SF 2.40Hrs
T.No.12628 కర్ణాటక SF 9.45Hrs
T.No.12486 నాందేడ్ SF 10Hrs
T.No.12804 స్వర్ణ జయంతి SF రైళ్లు కొన్ని గంటల పాటు నేడు PDPL మీదుగ ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే, రైల్వే ప్రయాణికులు గమనించాలని ఓ ప్రకటనలో సూచించారు.