News October 9, 2025

శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాల దర్శనానికి PM

image

ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకుంటారని సీఎం తెలిపారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రధాని టూర్‌ను సక్సెస్ చేయాలని సూచించారు.

Similar News

News October 9, 2025

కృష్ణా: సచివాలయ ఉద్యోగులకు.. ఇది అయ్యే పనేనా?

image

CM చంద్రబాబు ప్రతిష్టాత్మక P4 పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో 99,889, కృష్ణా జిల్లాలో 78,766 మంది పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. తొలి విడతలో ఎన్టీఆర్‌లో 64,390, కృష్ణాలో 31,967 మందిని దాతలు దత్తత తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరించి, లబ్ధిదారులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఇప్పటికే వివిధ సేవలతో ఉద్యోగులపై భారం పెరుగుతుందని ప్రజలు అంటున్నారు.

News October 9, 2025

6 రోజుల్లోనే రూ.5,620 పెరిగిన గోల్డ్ రేట్

image

బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,24,150కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,620 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,13,800 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,71,000కి చేరుకుంది. 6 రోజుల్లోనే రూ.9వేలు పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 9, 2025

లక్ష్మీదేవి పద్మం పైనే ఎందుకుంటుంది?

image

లక్ష్మీదేవిని పద్మంపై ఆసీనురాలిగా చూపడం వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది. తామరపువ్వు నీటిలో అటూ ఇటూ కదులుతూ, ఊగుతూ ఉంటుంది. ఆ తామర మాదిరిగానే సంపద కూడా చంచలమైనది. అంటే నిలకడ లేనిదని అర్థం. లక్ష్మీదేవి కమలంపై కొలువై ధనం అశాశ్వత స్వభావాన్ని మానవులకు నిరంతరం గుర్తుచేస్తుంది. సంపద శాశ్వతం కాదని, మనిషి గర్వం లేకుండా ఉండాలని ఈ దైవిక రూపం మనకు బోధిస్తుంది. <<-se>>#DHARMASANDEHALU<<>>