News January 9, 2026

శ్రీశైలంలో దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్రదేశం ఇదే..!

image

శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామికి గురువారం విశేష పూజలు చేశారు. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయ స్వామి తపస్సు చేశారని, అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షం అని పేరు వచ్చినట్లు తెలిపారు. ప్రతి గురువారం దేవస్థానం సర్కారీ సేవగా పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Similar News

News February 17, 2026

సంగారెడ్డి: రెండు నెలల్లో రేవంత్ పర్యటన

image

సంగారెడ్డి పట్టణంలో 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను సీఎంకు గిఫ్టుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News February 17, 2026

లెజెండరీ నటుడు కన్నుమూత!

image

హాలీవుడ్ లెజెండరీ నటుడు రాబర్ట్ డువల్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన 60 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 100 చిత్రాల్లో ఆయన నటించారు. హాలీవుడ్ గ్రేట్ మూవీస్ ‘ది గాడ్ ఫాదర్‌’, ‘ది గాడ్ ఫాదర్‌-2’లో కనిపించారు. టెండర్ మెర్సీస్ సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. మరో 6 సార్లు నామినేట్ అయ్యారు.

News February 17, 2026

దేవుడిపైనే భారం: మిచెల్ మార్ష్

image

శ్రీలంకతో కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా <<19162360>>ఓడిపోవడం<<>>పై ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించారు. ‘మంచి స్టార్టింగ్ వచ్చినా కొన్ని పరుగులు తక్కువ చేశాం. కానీ స్కోరును డిఫెండ్ చేసుకోవచ్చని అనుకున్నాం. శ్రీలంక బాగా ఆడింది. ఇక దేవుడిపైనే భారం. జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్‌ను ఆశతో చూస్తాం. ప్రస్తుతం నిరాశలో ఉన్నాం’ అని మ్యాచ్ అనంతరం చెప్పారు. జింబాబ్వే గెలుపోటములపైనే ఆసీస్ S-8 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.