News September 20, 2025
శ్రీశైలంలో దసరా మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు: ఈవో

ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడారు. భక్తులందరికీ శ్రీ స్వామి, అమ్మవార్ల సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేలా ఏర్పాట్లు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1న దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 20, 2025
కృష్ణ మిల్క్ యూనియన్‌కు Trusted Dairy Brand అవార్డ్

టైమ్స్ ఆఫ్ ఇండియా 7వ ఎడిషన్‌లో జరిగిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ “Trusted Dairy Brand” అవార్డును అందుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు స్వీకరించారు. ఈ అవార్డు రావడం పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News September 20, 2025
దేవుడి భూములపై గట్టిగా లీగల్ ఫైట్ చేయాలి: మంత్రి

దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలని, అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగట్లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీలో ఎండోమెంట్ గవర్నమెంటు ప్లీడర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఎండోమెంట్ కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి 6 నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని అధికారులను ఆదేశించారు.
News September 20, 2025
వరంగల్ జిల్లాలో 107 పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమం!

వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆలోచనల మేరకు జిల్లాలోని 107 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, విద్యాసంస్థల్లో శనివారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, మానసిక దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా అధికారులు, ఉపాధ్యాయులు, విశ్రాంత అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల శ్రేయస్సుపై చర్చించారు.