News April 12, 2025
శ్రీశైలంలో నేడు గిరి ప్రదక్షిణ కార్యక్రమం

పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. స్వామి, అమ్మవారికి మహా మంగళ హారతుల పూజల అనంతరం ఆలయ మహాద్వారం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు.
Similar News
News July 7, 2025
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. బరిగెల అరుణ్ కుమార్ (29), సిరిసిల్ల నెహ్రు నగర్‌కు చెందిన తడక సాయి చరణ్(27) లు <<16972767>>ఆదివారం<<>> ద్విచక్ర వాహనంపై సిరిసిల్లకు వెళ్తుండగా పెద్దూరు గ్రామ శివారులో వీరి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్ కుమార్ కు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
News July 7, 2025
ఇవాళ, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ, రేపు YSR కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న ఆయన రాత్రికి అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం 7.30 గంటలకు పులివెందుల నుంచి బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత YSR జయంతి సందర్భంగా ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుస్తారు.
News July 7, 2025
‘అనకాపల్లి జిల్లాలో 1.33 లక్షల మంది లబ్ధిదారులు’

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 1.33 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు ఆదివారం తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో వివరాలు సరిగా నమోదు కాని రైతులు 23 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఈనెల 10వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.