News February 24, 2025
శ్రీశైలంలో నేడు పుష్ప పల్లకీ సేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో నేడు శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకీ సేవను నిర్వహించనున్నారు.పూజా కార్యక్రమాలు ఇలా..◆ ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు◆ ఉదయం 9 గంటలకు రుద్రహోమం, చండీహోమం◆ సాయంత్రం 5.30 గంటలకు సాయంకాల అర్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంకాల హోమాలు జరుగుతాయి.
Similar News
News February 24, 2025
సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో డివైడర్‌ను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. చిన్నకోడూర్ మండలం మల్లారం గ్రామ శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రానికి చెందిన ఉలేష్ కుమార్ (40) విష్ణు ఠాకూర్ (42) అక్కడికక్కడే మృతి చెందారు. కొండపాక మండలానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి(22) మండలంలోని సిర్సనగండ్ల శివారులో డివైడర్‌ను ఢీకొట్టడంతో మరణించాడు.
News February 24, 2025
శ్రీకాకుళం: వంశధార గొట్ట బ్యారేజ్‌లో డెడ్ స్టోరేజ్

జిల్లాకు సాగునీరు అందించే వంశధార గొట్ట బ్యారేజ్‌లో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. దీంతో సాగునీటీతో పాటు, వంశధార నదీ పరివాహక ప్రాంతాలలో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. ఒడిశాలో వర్షాలు పడితే గాని బ్యారేజ్ నిండే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
News February 24, 2025
పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 1574, మహిళలు 759 మంది. అత్యధికంగా పార్వతీపురంలో 636, సాలూరులో 250 మంది ఉన్నారు. అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.