News February 19, 2025
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమైన అంశాలు!

● శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
● అన్ని ఆర్జిత సేవలు రద్దు.. ప్రముఖులకు 4విడతలుగా బ్రేక్ దర్శనం
● 22న టీటీడీ తరఫున స్వామి, అమ్మవార్లకు వస్త్రాల అందజేత
● 23న సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
● కాలినడక భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● శివరాత్రి రోజున ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం
● భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
● ఘాట్‌లో 24గంటల అనుమతి
● 453 స్పెషల్ బస్సులు ఏర్పాటు
Similar News
News February 16, 2026
JEE మెయిన్స్‌లో కడప జిల్లా యువకుడి సత్తా

JEE మెయిన్స్ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగుకి చెందిన డెంటల్ డాక్టర్ కిరణ్‌కుమార్ కుమారుడు పసల మోహిత్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. అతనికి 300కి 300 మార్కులతో 100% వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పసల మోహిత్, OBC కేటగిరీలో నరేంద్ర బాబుకి, SC కేటగిరీలో దేవశ్రీ వేద్‌లకు 100% లభించింది. మోహిత్‌కు మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందించారు.
News February 16, 2026
JEE మెయిన్స్‌లో భాష్యం విద్యార్థి ప్రభంజనం

JEE మెయిన్-2026లో భాష్యం IIT జేఈఈ అకాడమీ విద్యార్థి యోగ శివ సాయి శ్రీరామ్ HT.NO(260310102840) ప్రభంజనం సృష్టించాడు. విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ సోమవారం వివరాలు వెల్లడించారు. విద్యార్థి 99.99 టాప్ పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో టాపర్‌గా నిలిచి ఉత్తమ ప్రతిభ కనపరిచాడని చెప్పారు. వైస్ ఛైర్మన్ భాష్యం హనుమంతురావు విద్యార్థికి, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.
News February 16, 2026
ఉపాధి బిల్లుల నమోదు పూర్తిచేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదును నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.77.46 కోట్లు మాత్రమే అప్లోడ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన బిల్లులను వెంటనే నమోదు చేసి లక్ష్యాలు సాధించాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు రోజువారీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించారు.


