News February 13, 2026

శ్రీశైలంలో మల్లన్నకు నేడు పుష్ప పల్లకీ సేవ

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన నేడు శ్రీశైలం మల్లన్నకు పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఉదయం నుంచి చండీస్వర పూజ, రుద్ర, చండీ హోమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. సాయంత్రం ప్రత్యేక పూజలతో పాటు పుష్కరిణి, శివ దీక్ష శిబిరాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులను సౌకర్యం కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Similar News

News February 13, 2026

స్కూళ్లను బాగు చేస్తే ప్రమాణాలు ఎందుకు దిగజారాయి: లోకేశ్

image

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.

News February 13, 2026

BIG BREAKING: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

image

నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నీ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీలకు గాను 6 కాంగ్రెస్ గెలిచింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను కైవసం చేసుకుంది.

News February 13, 2026

సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.