News February 18, 2025

శ్రీశైలంలో విద్యుత్ కాంతులు

image

మల్లన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వీధులు విద్యుత్ దీప కాంతుల్లో వెలుగొందుతున్నాయి. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో శ్రీశైలంలోని వీధులను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో వివిధ ఆకృతుల్లో ఏర్పాటుచేసిన డెకరేషన్ లైట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాలతో శ్రీశైలం కొత్త శోభను సంతరించుకుంది.

Similar News

News February 25, 2026

సత్తా చాటిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు

image

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పరుగు పందెంలో ఎమ్మెల్యే గద్దె ప్రథమ స్థానం సాధించగా, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వాలీబాల్‌లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రొఫెషనల్ ప్లేయర్‌లా అదరగొట్టగా.. కబడ్డిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యర్థులను ఉడుంపట్టుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

News February 25, 2026

లోకేశ్ బాగా స్పందించారు.. నిర్లక్ష్యంగా అధికారులు: హైకోర్టు

image

AP: ఎన్టీఆర్(D) ఎ.కొండూరులోని KGBVలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి లోకేశ్ తక్షణమే స్పందించారని హైకోర్టు ప్రశంసించింది. మంత్రి ఇలా పనిచేస్తుంటే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడింది. KGBVల్లో పీజీటీల సేవలను కొనసాగిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి పట్టించుకోకపోవడంపై సర్వశిక్షా అభియాన్ పీడీ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

News February 25, 2026

WGL: 17 మంది వైద్యులపై వేటు

image

రాష్ట్రంలో విధులకు హాజరుకాక దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 17 మంది ఉన్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై విధుల్లో చేరని వారిని తొలగించారు.