News February 26, 2025
శ్రీశైలంలో విషాదం.. తండ్రీకొడుకులు మృతి

శివరాత్రి వేళ శ్రీశైలంలో విషాద ఘటన జరిగింది. శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న కృష్ణా నదిలో స్నానమాచరిస్తూ తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి మల్లన్న దర్శనార్థం వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జి కింద కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తండ్రి అతడిని కాపాడే ప్రయత్నంలో ఇరువురూ మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2025
జనసేన ఆవిర్భావ వేడుకలు.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఈయనే..!

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కర్నూలు పార్లమెంటుకు చింతా సురేశ్ నియమితులయ్యారు. కాగా, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
News February 26, 2025
నేడు కర్నూలు జిల్లాకు ప్రముఖ లేడీ సింగర్ రాక

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
News February 26, 2025
ఆదోనిని 4 మండలాలుగా విభజించండి: క్రిష్ణమ్మ

కర్నూలులో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను టీడీపీ ఆదోని మాజీ ఇన్‌ఛార్జ్ గుడిసె క్రిష్ణమ్మ మంగళవారం కలిశారు. ఆమె మాట్లాడుతూ.. ఆదోనిలో ప్రధానంగా రోడ్ల వెడల్పు, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రాబోయే వేసవి కాలంలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి కొరత సమస్యల గురించి కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో అతి పెద్దదైన ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించాలని విన్నవించారు.