News September 3, 2025

శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణంపై హరికథ

image

శ్రీశైలం దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నిత్య కళారాధన, ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు చెందిన భాగవతారిణి లక్ష్మీ మహేశ్ బృందం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం మీద నిర్వహించిన హరికథ గానం భక్తులను అలరించింది. మంగళవారం రాత్రి కళారాధన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రదర్శన అనంతరం కళాకారులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి అభినందించారు.

Similar News

News September 3, 2025

పుట్లూరులో రైతు ఆర్థిక సంక్షోభానికి సీఎం చలించి సహాయం

image

పుట్లూరుకు చెందిన తలారి శ్రీనివాసులు చిన్న రైతు. కుక్కల దాడిలో తన గొర్రెలన్నింటినీ కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారు. ముగ్గురు ఆడపిల్లలు. అందులో ఒకరు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. కుటుంబం తీవ్ర సంక్షోభంలో పడింది. పరిస్థితిని MP అంబికా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం తక్షణమే స్పందించి రూ.2.4 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఈ చర్య రైతుకు మానసికంగా మద్దతునిచ్చింది.

News September 3, 2025

ఈనెల 4న కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ

image

ఈనెల 4న కర్నూలులో 730 వినాయక విగ్రహాల నిమజ్జనం ఊరేగింపును పురస్కరించుకొని ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బళ్లారి చౌరస్తా మీదుగా నంద్యాల చెక్ పోస్ట్ వైపు రాకపోకలు సాగిస్తాయన్నారు. బస్టాండ్ నుంచి రాజ్ విహార్, ప్రభుత్వ అసుపత్రి, వినాయక ఘాట్, గాయత్రి ఎస్టేట్ మీదుగా వాహనాలను నిషేధించినట్లు వెల్లడించారు. నగర ప్రజలు సహకరించాలన్నారు.

News September 3, 2025

నేడు, రేపు భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశమున్న నేపథ్యంలో ఇవాళ, రేపు APలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు TGలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.