News February 25, 2025
శ్రీశైలంలో శివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి భద్రతా ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. నంద్యాల ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి క్షేత్ర పరిధిలో పర్యటించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News February 25, 2025
అనకాపల్లి: ‘ఈనెల 27న వారికి సెలవు’

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈనెల 27వ తేదీన ప్రత్యేక క్యాజువల్ లీవు మంజూరు చేస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
News February 25, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్
➤ యూజీసీ నెట్లో అన్నవరం యువకుడి ప్రతిభ
➤ నిందితుల గుర్తింపునకు యాప్: రాజవొమ్మంగి ఎస్సై
➤ జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు: రంపచోడవరం ఐటీడీఏ పీవో
➤ రహదారి సౌకర్యం కల్పించాలని అనంతగిరి గిరిజనుల పాదయాత్ర
➤ జీకే వీధి మండలంలో ఊరంతా ఏకమై రోడ్డు నిర్మాణం
➤ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లాలో వైన్ షాపులు క్లోజ్
News February 25, 2025
సిద్దిపేట: యూనిఫాంలపై అదనపు కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాల, వివిధ రకాల గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వచ్చే అకాడమిక్ సంవత్సరంలో స్కూల్ యూనిఫాం అందజేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గూర్చి జిల్లా అదనపు కలెక్టర్ గరిమ ఆగ్రవాల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అధికారులు సమీక్ష నిర్వహించారు.