News September 20, 2025
శ్రీశైలంలో 22 నుంచి నిత్య అలంకరణలు ఇవే..!

దసరా నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీశైలంలో జరిగే నిత్య అలంకార సేవలు ఇవే..
☞ ఈనెల 22న శైలపుత్రీ దుర్గ ☞ 23న బ్రహ్మచారిణి దుర్గ
☞ 24న చంద్ర ఘంట దుర్గ ☞ 25న కూష్మాండ దుర్గ
☞ 26న స్కంద మాత దుర్గ ☞ 27న కాత్యాయని దుర్గ
☞ 28న కాళరాత్రి దుర్గ ☞ 29న మహాగౌరి దుర్గ
☞ 30న సిద్ధిదాయిని దుర్గ ☞ 01న రాజరాజేశ్వరి
☞ 02న శ్రీ భ్రమరాంబిక దేవి
Similar News
News September 21, 2025
పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో నిర్వహించబోయే పోషణ మాసోత్సవాలను విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం పోషణ మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఛాంబర్‌లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నెలరోజుల పాటు కొనసాగనున్న మాసోత్సవాలలో గ్రామస్థాయిలో గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని అన్నారు.
News September 21, 2025
గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ.. రైతుల విజ్ఞప్తులు ఇవే..!

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణలో నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారుల భూములకు రిజిస్టర్ మార్కెట్ ధరలో సగం మేర మాత్రమే ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. 20ఏళ్ల క్రితం డీఆర్‌డీఈ ద్వారా మొక్కల పెంపకానికి ఇచ్చిన భూములకు కూడా నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. సోమవారం విశాఖ వస్తున్న CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా హామీ ఇచ్చారు.
News September 21, 2025
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సమీక్ష

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణపై MLAగంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్షించారు. గ్రామంలో సబ్‌రిజిస్ట్రార్ ధర ఎకరానికి రూ.17లక్షలు ఉందని, D.పట్టా భూములకు ఎకరానికి రెండున్నర రెట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. 520మంది రైతులకు వారి భూముల స్వరూపాన్ని బట్టి పరిహారం అందిస్తామన్నారు. గూగుల్ డేటా సెంటర్‌లో రైతుల కుటుంబాలకు ఉపాధి ఇచ్చేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు.