News January 10, 2026
శ్రీశైలంలో 3 వేల మంది పోలీసులతో బందోబస్తు

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని ఎస్పీ సునీల్ షొరాణ్ సూచించారు. సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సాక్షి గణపతి నుంచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News February 22, 2026
ఎర్రగుంట్ల: రాత్రి రైలు ఎక్కి.. ఉదయానికి మిస్సింగ్

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ముక్కా ధనలక్ష్మి (25) అదృశ్యమైంది. ఈ మహిళ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురువిమానిపల్లెకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి భార్య. ఇరువురు విజయవాడలో శుక్రవారం రాత్రి రిజర్వేషన్ బోగీలో ఎక్కారు. తెల్లవారేసరికి తన భార్యలేదని భర్త ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 22, 2026
HYD: 80% సబ్సిడీతో ఈ-స్కూటర్లు

మైనారిటీ యువత ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ-స్కూటర్స్ పంపిణీ పథకం అమలు చేస్తున్నట్లు RR జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ- స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా అందులో 80% సబ్సిడి (రూ.1.20 లక్షలు) ప్రభుత్వం అందిస్తుందని మిగిలిన 20%(రూ.30,000) లబ్ధిదారుడి వాటా కింద చెల్లించాలన్నారు.
# SHARE IT
News February 22, 2026
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. నలుగురు పోలీసులపై వేటు

డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో MLC అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హోం శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో పనిచేసిన DSPలు భీమారావు, మురళీకృష్ణారెడ్డి, CI మురళీకృష్ణ, SI సతీశ్‌ను సస్పెండ్ చేసింది. సిట్ నివేదిక, పోలీసుల పాత్రపై అనుమానాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు వాఖ్యల మేరకు చర్యలు తీసుకుంది. కాగా ఈ కేసులో అనంతబాబు దంపతులు పరారీలో ఉన్నారు.


