News April 11, 2025
శ్రీశైలం: అంగన్వాడీ సెంటర్‌లపై ఫుడ్ కమిషన్ చర్యలు చేపట్టేనా..?

శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్‌లపై ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చర్యలు చేపడతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరం క్రితం నుంచి అంగన్వాడీ కేంద్రాలపై పలువురు ఫుడ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మండల పరిధిలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్త ప్రతాపరెడ్డి తనిఖీలు చేపట్టారు. ఆయన పర్యటన నేపథ్యంలో అక్రమాలకు పాలుపడుతున్న సెంటర్లపై చర్యలు చేపట్టవలసిన అవసరం నెలకొంది.
Similar News
News February 25, 2026
గట్ హెల్త్‌కు ఇవి సూపర్ ఫుడ్స్

ఆరోగ్యంగా ఉండాలంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం. అందుకే రోజూ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు, కిమ్చీ వంటివి తీసుకోవాలి. ఉడికించి చల్లార్చిన చిలగడదుంపలు, కొంచెం నెయ్యి పేగులకి చాలా మంచివి. అలాగే కలోంజీ టీ తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. డైట్‌లో ఫైబర్ చేర్చుకునేటప్పుడు ఒక్కసారిగా కాకుండా మెల్లగా పెంచడం మంచిది.
News February 25, 2026
మెదక్ పోలీసులకు 6 Medals

తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ పోలీసులు 6 రజత పతకాలు సాధించారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో హ్యాట్రిక్ రజతాలు గెలిచారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను సత్కరించి అభినందించారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు.
News February 25, 2026
AI పుణ్యమా అని పెరిగిన ఆదాయం!

AI వల్ల 40%కి పైగా భారతీయ ఉద్యోగుల ఆదాయం పెరిగిందని బ్యాంక్‌బజార్ నివేదిక వెల్లడించింది. 22-45 ఏళ్ల మధ్య వయస్సు గల శాలరీడ్‌లో ఈ మార్పు కనిపిస్తోంది. అయితే ఐదుగురిలో ఒకరు AI వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భారతీయులు మొదటి ప్రాధాన్యం ఆరోగ్యానికి ఇస్తుండగా.. తర్వాత సొంత ఇల్లు, పిల్లల చదువును కీలకంగా భావిస్తున్నారు.


