News October 9, 2025
శ్రీశైలం అధికారులకు సీఎం ప్రశంస

రాష్ట్ర ప్రజలకు శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 16న PM మోదీ శ్రీశైలానికి రానుండటంతో సీఎం పేరుతో ఓ లెటర్ విడుదలైంది. శ్రీశైల దేవస్థానం ప్రతినిధులు ‘శ్రీశైల నూతన తామ్ర శాసనాలు’ అనే గ్రంధాన్ని ప్రచురించడం, ప్రధాని తిలకించేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రదర్శన పెట్టడం అభినందనీయమని సీఎం కొనియాడారు.
Similar News
News October 9, 2025
మోస్రా: నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

మోస్రాలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. నామినేషన్‌లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎలక్షన్ అధికారులు రతన్, రవీందర్, అంబర్ సింగ్ పాల్గొన్నారు.
News October 9, 2025
BPCL రిఫైనరీ కోసం 6వేల ఎకరాలు

AP: NLR(D) రామాయపట్నం వద్ద BPCL సంస్థకు ప్రభుత్వం 6వేల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేపిటల్ వ్యయంలో 75% (₹96000 కోట్లు) ఆర్థిక ప్రోత్సాహకాల కింద 20 ఏళ్లలో అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ భూముల్లో ₹1లక్ష కోట్లతో ఆ సంస్థ గ్రీన్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్సును ఏర్పాటుచేస్తుంది. ఈ FYలో ₹4,843కోట్లు, తర్వాత వరుసగా 5 ఏళ్లలో ₹96,862 కోట్లు BPCL పెట్టుబడిగా వెచ్చించనుంది.
News October 9, 2025
కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం: లోకేశ్

AP: TDP కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులని, వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడం తన బాధ్యత అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనుచరుల దాడిలో గాయపడి, అస్వస్థతతో ఇటీవల మరణించిన శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లికి రప్పించి మాట్లాడారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయన గట్టిగా పోరాడారని, స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఇలాగే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు.