News March 16, 2025

శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారా: భూమన 

image

కడపలోని కాశీనాయన క్షేత్రాన్ని కూల్చడం దారుణమని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టైగర్ జోన్ కావడంతో కూల్చామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై CM నుంచి ఒక్క మాట కూడా రాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌పై సైతం ఆయన విమర్శలు గుప్పించారు. ‘పవనా నంద స్వామి.. దీనిపై తమరు ఎందుకు మాట్లాడటం లేదు’ అని ప్రశ్నించారు.  

Similar News

News March 16, 2025

అచ్చంపేట: ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

image

అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం దేవాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందికి వస్తున్న ఆటో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. అమ్రాబాద్ మండలం తెలుగుపల్లికి చెందిన తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయని అచ్చంపేట పోలీసులు తెలిపారు. ఓ పెళ్లి వేడుక నిమిత్తం కొండపైకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందని అన్నారు. గాయాలైన వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

News March 16, 2025

నెల్లూరు: రైతును చెరువులో తోసి నగదుతో పరార్

image

తక్కువ ధరకు డీజిల్ ఇస్తానని నమ్మించి ఓ అపరిచితుడు రైతును బూరిడీ కొట్టించిన ఘటన ఆదివారం మనుబోలులో చోటు చేసుకుంది. మనుబోలుకు చెందిన ఓ రైతుకు బైకుపై వచ్చిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. రైతుకు తక్కువ ధరకు 300 లీటర్లు డీజిల్ ఇస్తామని నమ్మించి 25 వేల రూపాయలను రైతు నుంచి తీసుకున్నాడు. అ తర్వాత ఆ రైతును చెరువులో తోసి పరారయ్యాడు.

News March 16, 2025

నిజామాబాద్: అనుమానాలను నివృత్తి చేయాలి: కవిత

image

గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని అంటున్నారన్నారు. 

error: Content is protected !!