News August 16, 2025
శ్రీశైలం ఘాట్ రూట్‌లోనూ ఫ్రీ జర్నీ

శ్రీశైలం ఘాట్ రోడ్డులోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు నంద్యాల ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా తెలిపారు. తొలుత ఘాట్ రోడ్డులో అనుమతి లేదని అధికారులకు ఆదేశాలు అందాయి. ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీశైలానికి కూడా ఉచిత ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంపై Way2News ఆర్ఎంను సంప్రదించగా శ్రీశైల క్షేత్రానికి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని తెలిపారు.
Similar News
News August 16, 2025
ఈ ఏడాది 13,260 మందిపై కేసులు: VZM SP

ఈ ఏడాది ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 13,260 మందిపై కేసులు నమోదు చేశామని SP వకుల్ జిందల్ శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, దొరికిన వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
News August 16, 2025
అమరావతి ఐకానిక్ టవర్ల పునాదుల్లో నీరు చేరటానికి కారణమిదే!

అమరావతి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐకానిక్ టవర్ల పునాదులు 1, 2లో భారీగా నీరు చేరింది. రాయపూడి నుంచి వస్తున్న పాలవాగు బ్రాంచ్ కెనాల్ నీరు దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. వరద నీరు నిలవకుండా మూడు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వర్షాకాలానికి అనుగుణంగా పనులు చేపట్టినందున ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.
News August 16, 2025
ఎస్పీ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతి

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం సర్దార్ గౌతు లచ్చన్న “జయంతి” సందర్భంగా.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అదనపు ఎస్పీ వెంకటాద్రి ఘన నివాళులర్పించిన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న అని అన్నారు. ఆయన ఆశయాలను స్పూర్తిగా తీసుకోవాలన్నారు.