News December 19, 2025

శ్రీశైలం చేరుకున్న భారత ఎన్నికల కమిషనర్

image

శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం చేరుకున్నారు. దేవస్థానం అతిథి గృహం వద్ద ఆయనకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఈవో శ్రీనివాసరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

Similar News

News December 20, 2025

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. ప్రభావం చూపని BJP!

image

ఉమ్మడి NLG జిల్లాలో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీ BJP కనీస ప్రభావం చూపించలేక పోయిందన్న టాక్ వినిపిస్తోంది. BJP కంటే అధికంగా జిల్లాలో స్వతంత్రులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లాలో 1,779 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు 1,136స్థానాలు వచ్చాయి. BRSకు 475, CPI, CPM ఇతరులకు 145స్థానాలు రాగా BJPకి 22 వచ్చాయి. కాగా ఇతరుల్లో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉన్నారు.

News December 20, 2025

సూర్యాపేట: 4 GOVT జాబ్స్ కొట్టిన యువకుడు

image

కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధిస్తారని మాటను నిజం చేశాడు ఆ యువకుడు. పట్టుదలతో చదివితే విజయం వరిస్తుందని నిరూపిస్తూ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లింగంపల్లికి చెందిన వీరబోయిన దయాకర్ ప్రస్థానం ఒకే ఉద్యోగంతో ఆగిపోలేదు. ఆయన వీఆర్వో, ఆర్‌ఆర్బీ టెక్నీషియన్, PCతోపాటు, తాజాగా విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు.

News December 20, 2025

మేడిగడ్డ వ్యవహారం.. L&Tపై క్రిమినల్ కేసు!

image

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పనులు చేపట్టిన L&T సంస్థపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. L&Tపై క్రిమినల్ కేసుకు న్యాయశాఖ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి L&Tదే బాధ్యత అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయనుంది.