News July 31, 2024

శ్రీశైలం జలాశయం UPDATE

image

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి ఇన్‌ఫ్లో 2.93 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఓట్ ఫ్లో 2.84 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 855 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరిందని అధికారులు వివరించారు.

Similar News

News February 1, 2026

MBNR: మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: ఎంపీ డీకే

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఎంపీ డీకే అరుణ తన నివాసంలో ఇన్‌ఛార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. 14 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో గెలుపు వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఫిబ్రవరి 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక నేపథ్యంలో కార్యకర్తల సమావేశ ఏర్పాట్లను ఆమె సమీక్షించారు.

News February 1, 2026

MBNR: యాజమాన్యాలపై 54 కేసులు: ఎస్పీ జానకి

image

బాలకార్మికులను పనుల్లో పెట్టుకున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని, 54 కేసులు నమోదు చేసినట్లు SP జానకి తెలిపారు. విముక్తి పొందిన పిల్లలను CWCకి అప్పగించామని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను తిరిగి చదువుల్లో చేర్పించాలని సూచించినట్లు పేర్కొన్నారు. బాలకార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారమివ్వాలన్నారు.

News February 1, 2026

MBNR: ఆపరేషన్ స్మైల్–XII.. 83 మంది విముక్తి

image

బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–XII కార్యక్రమంలో భాగంగా.. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. మొత్తం 83 మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం, వీరిలో 7 మంది బాలికలు,76 మంది బాలురు ఉన్నారని వెల్లడించారు.