News June 15, 2024

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా చేరుతున్న వరద నీరు

image

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. శనివారం తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి 15,131 క్యూసెక్కులు చేరాయి. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 810.90 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 34.8332 టీఎంసీలుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిస్తే అనుకున్న మేరకు నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.

Similar News

News October 2, 2024

కర్నూలు: 24 గంటల్లో మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

image

పత్తికొండ మండలం పుచ్చకాయలమడకు చెందిన అశోక్ అనే నిరుద్యోగి తనకు ఆటో ఇప్పించాలని నిన్న సీఎం చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. సీఎం హామీ మేరకు బుధవారం అశోక్‌కు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా ఆటో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు.

News October 2, 2024

రేపటి నుంచి టెట్ పరీక్ష ప్రారంభం

image

కర్నూలు జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేశారు. దాదాపు 40,660 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 విడతలుగా నిర్వహిస్తున్నారు. కర్నూలులో 4, ఆదోని, ఎమ్మిగనూరులో ఒక్కొక్క కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుడు నరసింహారావు, విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఏర్పాట్లను పరిశీలించారు.

News October 2, 2024

ఎమ్మిగనూరులో 4న జాబ్ మేళా.. కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 4న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు MLA జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్, బీటెక్, డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.