News February 27, 2026
శ్రీశైలం: జల వనరుల శాఖ అధికారా.. మజాకా..!

శ్రీశైలం ప్రాజెక్టు జల వనరుల శాఖ C&B ఇన్‌ఛార్జ్ EE తాను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుమస్తా స్థాయి వాళ్లకు ఓ న్యాయం, ఇంజినీరింగ్ స్థాయి వాళ్లకు మరో న్యాయమంటూ జీవో నంబర్ 21నే పక్కదారి పట్టిస్తున్న తీరు అధికారులను సైతం విస్మయానికి గురి చేస్తున్నట్లు సమాచారం. GO లేని అంశాలను కూడా తెరపైకి తెస్తూ రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
Similar News
News March 3, 2026
కీసరగుట్ట ఆలయ గోపురంపై అద్భుత దృశ్యం

నగర శివారులోని ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీభవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి గుడిలో సోమవారం రాత్రి అద్భుత దృశ్యం కనివిందు చేసింది. స్వామివారి గుడి శిఖరంపై పౌర్ణమి చంద్రుడిని చూసిన భక్తులు పరవశించిపోయారు. అనంతరం శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని బంధనం చేశారు.
News March 3, 2026
స్నేహభావంతో హోలీ జరుపుకోవాలి: డీసీపీ రాజమహేంద్ర నాయక్

జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ హోలీ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగను శాంతి, సామరస్యాలతో జరుపుకోవాలని కోరారు. రసాయనిక రంగులను ఉపయోగించకుండా సహజ రంగులతో పండుగను జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పరస్పర గౌరవంతో, స్నేహభావంతో జరుపుకోవాలని సూచించారు.
News March 3, 2026
నెల్లూరు: స్పెషల్ డ్రైవ్ పెడుతున్నా.. శృతి మించుతున్నారు

జిల్లాలో పోలీసులు ఎప్పటికప్పుడు నాకా బందీలు చేపడుతున్నా.. ఎక్కడికక్కడ శృతి మించుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన పలు సందర్బల్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా.. 57 లాడ్జిలను, 1694 వాహనాలను తనిఖీ చేయగా.. 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో 28 మంది పట్టుబడ్డారు. నిభందనలు పాటించనివారిపై 157 కేసులు నమోదు చేశారు. రూ. 1.52 లక్షలు జరిమానా విధించారు.


