News July 6, 2025

శ్రీశైలం డ్యాంకు భారీగా వరద

image

కృష్ణనది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా గతంలో ఎన్నడు లేని విధంగా మే నెల నుంచే శ్రీశైలం జలాశయానికి వరద నీటి చేరిక ప్రారంభమైంది. దీంతో డ్యాం వేగంగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతోంది. ప్రస్తుతం జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 1,71,208 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. డ్యామ్ నీటిమట్టం 878.40 అడుగులుగా నమోదైంది.

Similar News

News July 7, 2025

కడుపులో పెన్నులు.. బయటకు తీసిన వైద్యులు

image

నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో వైద్యశాలకు చేరిన యువతకి సిటీ స్కాన్ చేయడం ద్వారా నాలుగు పెన్నులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేశారు.

News July 7, 2025

బ్యాటింగ్, బౌలింగ్ అదరగొట్టారుగా..

image

రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలుపుతో గిల్ కెప్టెన్‌గా విజయాల ఖాతా తెరిచారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. ఈ మైదానంలో ఆడిన గత 8 మ్యాచుల్లో ఏడు ఓడిపోగా ఒక మ్యాచును డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్, రెండో ఇన్నింగ్సులో ఆకాశ్ దీప్ ఆరేసి వికెట్లతో అదరగొట్టారు. అటు కెప్టెన్ గిల్ 430 పరుగులతో మరిచిపోలేని ప్రదర్శన చేశారు. జడేజా, పంత్, జైస్వాల్, రాహుల్ తమ వంతు పాత్ర పోషించారు.

News July 7, 2025

రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

రేపు APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మరోవైపు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, RR, HYD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.