News August 13, 2025
శ్రీశైలం డ్యాం.. మరో రెండు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యాం మరో రెండు గేట్లు ఎత్తి మొత్తంగా 6 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల, హంద్రీనీవా ద్వారా 1,51,951 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాదిలో మే నెలలోనే శ్రీశైలానికి వరద ప్రారంభం కావడంతోపాటు మూడవసారి గేట్లను తెరచి సాగర్‌కు నీటిని విడుదల చేయటం విశేషం.
Similar News
News August 14, 2025
మెట్ పల్లి: పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: మధుయాష్కి గౌడ్

BRS పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. మెట్ పల్లిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తాను నిజామాబాద్ ఎంపీగా, కోరుట్ల ఎమ్మెల్యేగా రత్నాకర్ రావు ఉన్న హయంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్లీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, కృష్ణారావు తదితరులున్నారు.
News August 14, 2025
బాసర ఆర్జీయూకేటీలో మాదకద్రవ్యాలపై అవగాహన

బాసరలోని ఆర్జీయూకేటీలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్‌ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలను వాడబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పేర్కొన్నారు.
News August 14, 2025
వేములవాడ: ‘యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు’

వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. వేములవాడ ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రిన్సిపల్ టి.శంకర్ పేర్కొన్నారు.