News October 15, 2025
శ్రీశైలం రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు

ప్రధాని <<18008909>>మోదీ<<>> పర్యటన నేపథ్యంలో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాద్-శ్రీశైలం, దోర్నాల-శ్రీశైలం మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ప్రధాని పర్యటన అనంతరం రాకపోకలు మళ్లీ ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
Similar News
News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.
News October 15, 2025
జగిత్యాల : ఖాతాదారులు KYC సమర్పించాలి

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వినియోగదారులు తమ ఖాతాలకు KYC సమర్పించాలని జనరల్ మేనేజర్ తెలిపారు. కస్టమర్లు వాడని ఖాతాలను తిరిగి వాడుకునేందుకు, క్లెయిమ్ చేయని డిపాజిట్లను పొందేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. కావున ఖాతాదారులు తమ సమీప బ్రాంచ్ వెళ్లి సంబంధిత పత్రాలను అందజేయాలన్నారు. 10 సం.లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లు భారత రిజర్వ్ బదిలీ చేయబడ్డాయి అన్నారు. వీటికోసం సంబంధిత బ్యాంక్ నుసంప్రదించాలన్నారు.
News October 15, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.