News October 8, 2025
శ్రీశైలానికి తగ్గిన వరద.. 4 గేట్లు మూసివేత

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో బుధవారం 6 గేట్లలో 4 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయానికి జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల ద్వారా 67,120 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలానికి చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది.
Similar News
News October 8, 2025
ట్రిపుల్ టెస్ట్ సర్వే అంటే ఏంటి?

TG: BC రిజర్వేషన్లపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు ట్రిపుల్ టెస్ట్ సర్వే అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు. 2021లో వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ MH, ఇతరుల కేసుల్లో SC ట్రిపుల్ టెస్ట్‌ను ఏర్పాటు చేసింది. అదేంటంటే?
✎ OBC వెనుకబాటుతనంపై కమిషన్ ఏర్పాటు చేయాలి.
✎ ఆ కమిషన్ ఇచ్చే డేటా బేస్ చేసుకొని రిజర్వేషన్ % నిర్ణయించాలి.
✎ SC, ST, OBC రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదు.
News October 8, 2025
రాధికను అభినందించిన ఎస్పీ జానకి

కాంస్య పతకం సాధించిన అడ్డాకల్ PSకు చెందిన కానిస్టేబుల్ రాధికను MBNR ఎస్పీ డి.జానకి అభినందించారు. హరియాణాలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్(ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్)–2025-26లో తెలంగాణ పోలీస్ బృందం తరపున పాల్గొన్న రాధిక 80+ కేటగిరీలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించారు. దీంతో రాధికను తన చాంబర్‌లో శాలువా కప్పి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
News October 8, 2025
RTI ద్వారా పాలనలో బాధ్యత, పారదర్శకత: ఎస్పీ

సూర్యాపేట: సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా పాలనలో మరింత పారదర్శకత, బాధ్యత పెరుగుతుందని ఎస్పీ నరసింహ అన్నారు. ఈ నెల 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చట్టం కింద ప్రజలు కోరిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.