News March 30, 2025
శ్రీశైల ఆలయ క్యూలైన్లను పరిశీలించిన నంద్యాల ఎస్పీ

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, భక్తుల కంపార్ట్మెంట్ లు, క్యూలైన్లు, లడ్డు కౌంటర్ తదితరాలను పరిశీలించారు. విధులలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాదరావు ఉన్నారు.
Similar News
News April 1, 2025
కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చేటని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పానీయాల్లో అధికంగా ఉండే సుక్రోజ్‌తో శరీరానికి ప్రమాదమేనని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. అధిక శాతం సుక్రోజ్ ఉండే పానీయాలతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News April 1, 2025
ఈనెల 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్: విశాఖ డిఈవో

జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కళాశాలలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు డిఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 900 మంది ఉపాధ్యాయులు, అధికారులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.
News April 1, 2025
నంద్యాల జిల్లాలో 84.63% పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల సమయానికి నంద్యాల జిల్లాలో 84.63% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గాను, 1,81,608 మందికి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ సొమ్మును అందజేశారు.