News February 8, 2025

శ్రీశైల జలాశయం నుంచి 6,249 క్యూసెక్కుల నీరు విడుదల

image

శ్రీశైల జలాశయం బ్యాక్ వాటర్ నుంచి గడిచిన 24 గంటల వ్యవధిలో 6,249 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,560 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆవిరి రూపంలో 272 c/s లాస్ అయింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 852 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 84.4800 టీఎంసీలుగా నమోదైంది.

Similar News

News July 9, 2025

మహబూబాబాద్ జిల్లాకు 8 సబ్ స్టేషన్లు మంజూరు

image

జిల్లాలో వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా 8 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని సూపరింటెండెంట్ ఇంజినీర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని, సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని వివరించారు.

News July 9, 2025

‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్‌కు రూ.100 కోట్లు?

image

హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ‘హొంబలే ఫిల్మ్స్’ ₹15 కోట్లతో రూపొందిస్తే ₹400 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ చిత్రానికి రిషబ్ ₹4కోట్లు మాత్రమే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కాంతార ప్రీక్వెల్’పై భారీ అంచనాలు ఉండటంతో రిషబ్ తన పారితోషికాన్ని భారీగా పెంచి ₹100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

News July 9, 2025

SRSPలో తగ్గిన వరద నీటి ప్రవాహం

image

మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.