News February 23, 2025
శ్రీశైల మల్లన్నకు అమరచింత పట్టు వస్త్రాలు

శ్రీశైల మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీలు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు. పద్మశాలి వంశస్థులు భాగస్వాములై ఏటా పట్టు వస్త్రాలను నేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మల్లన్న సన్నిధిలో ప్రియమైన నిష్ఠలతో పట్టు వస్త్రాలను తయారు చేసి బ్రహ్మోత్సవాల రోజు స్వామివారికి సమర్పించనున్నట్లు అధ్యక్షులు మహంకాళి విష్ణు తెలిపారు.
Similar News
News February 23, 2025
సూర్యాపేట: నకిలీ పోలీస్ మోసం

SRPT జిల్లాలో నకిలీ డీఎస్పీ ఉదంతం బయటకు వచ్చింది. మఠంపల్లి చెందిన యువకుడు కారు డ్రైవర్. తను డీఎస్పీనని APకి చెందిన మహిళను నమ్మించినట్లు సమాచారం. SI జాబ్ ఇప్పిస్తానని రూ.32 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చాలా రోజులు ఎదురు చూసిన ఆమె మోసపోయినట్లు గ్రహించి మఠంపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
News February 23, 2025
సీఎం రేవంత్‌కు ఫోన్ చేసిన రాహుల్

TG: SLBC టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న రాహుల్, సహాయక చర్యలపై ఆరా తీశారు. మరోవైపు SLBC టన్నెల్ దగ్గర కాంట్రాక్టర్, ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలపై చర్చిస్తున్నారు.
News February 23, 2025
యూజీసీ NET ఫలితాల విడుదల

యూజీసీ నెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం జనవరిలో పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించిన కీని ఈ నెల 3న విడుదల చేసింది. నెట్ పరీక్షకు 6.49 లక్షల మంది హాజరయ్యారు. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5,158 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్‌కు 48,161 మంది, PhD కోసం 1,14,445 క్వాలిఫై అయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ <