News February 25, 2025
శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరిన అమరచింత పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి పురస్కరించుకొని అమరచింత పద్మశాలీలు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పది రోజులపాటు నియమ నిష్టలతో స్వామికి పట్టు వస్త్రాలు నేశారు. పది రోజులపాటు నియమ నిష్ఠలతో నేసిన ఈ పట్టు వస్త్రాలను అమరచింత మహంకాళి శ్రీనివాసులు కవితా రాణి దంపతులు తలపై పట్టు వస్త్రాలను పెట్టుకుని శ్రీశైల మల్లన్నకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సత్యనారాయణ ఎల్లప్ప కడుదాస్ సిద్ధమ్మ పాల్గొన్నారు.
Similar News
News February 25, 2025
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్: ఇలా త్రిపాఠి

ఈనెల 27న జరగనున్న వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27సాయంత్రం 4 గంటల వరకు సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధమని చెప్పారు.
News February 25, 2025
విజయవాడ : వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ భారతి నగర్‌లోని ఇటీవల ఓ బాడీ మసాజ్ సెంటర్లో వైసీపీ ఎస్టీ సంఘం నేత వడిత్య శంకర్ నాయక్ దొరికారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
News February 25, 2025
వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ

విజయవాడలోని స్పా సెంటర్‌లో పోలీసులకు దొరికిన వైసీపీ నేత వడిత్యా శంకర్ నాయక్‌ను పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.