News March 21, 2025
శ్రీసత్యసాయి: పది పరీక్షకు 111 మంది విద్యార్థుల గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 104 మంది, ప్రైవేట్ విద్యార్థులు ఏడు మంది గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
అన్నమయ్య: దత్తత అవగాహన కార్యక్రమం-2025 గోడపత్రికల విడుదల

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో ‘దత్తత అవగాహన కార్యక్రమం-2025’ గోడపత్రికలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు PGRS సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్‌లో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కుటుంబ ఆధారిత సంరక్షణ అందించాలాన్నారు.
News November 10, 2025
ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
News November 10, 2025
VKB: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరచాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు. సాధారణ పరిశీలనలో భాగంగా పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.


