News January 30, 2025
శ్రీసత్యసాయి పాఠశాలల వేసవి సెలవుల షెడ్యూల్ విడుదల

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలకు వేసవి సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 17వ తేదీ పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని శ్రీ సత్యసాయి పాఠశాలల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
Similar News
News February 18, 2026
VJA: తలశిల చంద్రశేఖర్‌రావు మృతికి జగన్ సంతాపం

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖర్‌రావు (88) మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు YS జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లిన జగన్, చంద్రశేఖర్ రావు భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
News February 18, 2026
చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.
News February 18, 2026
మామునూర్‌లో ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటుకు అవకాశం

వరంగల్ మామునూరు విమానాశ్రయంలో ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో విమానయాన శిక్షణకు అడుగులు పడటం వల్ల మంచి పరిణామం. ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటు ద్వారా పైలట్ ట్రైనింగ్, ఏవియేషన్ టెక్నికల్ కోర్సులు, గ్రౌండ్ స్టాఫ్ శిక్షణ వంటి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.


