News February 3, 2025

శ్రీసత్యసాయి: బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

image

సోమవారం హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్ని జరగనున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం స్థానిక పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఎన్నిక సమయంలో కార్యాలయంలోకి కౌన్సిలర్లను మాత్రమే అనుమతించాలని, ప్రతి ఒక్కరిని డీఎఫ్ఎండీ ద్వారా చెక్ చేసి పంపించాలని అధికారులను ఆమె ఆదిశించారు.

Similar News

News February 3, 2025

చరిత్ర సృష్టించిన రసెల్

image

వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.

News February 3, 2025

NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం

image

సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

News February 3, 2025

IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే

image

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.