News July 24, 2024

శ్రీసత్యసాయి: మిషన్ వాత్సల్య పథకానికి 378మంది పిల్లల ఎంపిక

image

మిషన్ వాత్సల్య పథకం ద్వారా సత్యసాయి జిల్లాలో 378మంది పిల్లలను ఎంపిక చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలు, ఎచ్‌ఐవి ప్రభావిత పిల్లలు, పీఎం కేర్ పిల్లలు, కోవిడ్ సెమి అర్బన్ బాల బాలికలు ఇంటి వాతావరణంలో చక్కగా చదువుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News November 10, 2025

కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.

News November 10, 2025

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.

News November 10, 2025

రైల్వే డీఆర్ఎంతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం

image

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సోమవారం డివిజన్‌లో అభివృద్ధి పనులపై ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో సమావేశమయ్యారు. అనంతరం రైల్వే డివిజన్‌లో రైల్వే స్టాపింగ్స్, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్ట్, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు మొదలైన అంశాలపై చర్చించారు.